: ఆప్ పిటిషన్ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ


మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలంటూ కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. కాగా, తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి, ఎన్నికలు నిర్వహించాలంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏఏపీ శాసనసభ్యులతో వెళ్లి నిన్న (గురువారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

  • Loading...

More Telugu News