: ‘తూర్పు’లో అగ్నిప్రమాదం... 35 ఇళ్లు బుగ్గిపాలు
తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐనవల్లి మండలంలోని వీరవెల్లిపాలెంలో 35 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. 50 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఘటనా స్థలానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేరుకుని, బాధితులను పరామర్శించారు.