: అల్లూరి ఉద్యమాలు భావితరాలకు స్పూర్తిదాయకం: మంత్రి పీతల సుజాత
బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమాలు భావితరాలకు స్పూర్తిదాయకమని మంత్రి సుజాత అన్నారు. అల్లూరి స్వగ్రామం మోగల్లులో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ను మంత్రి కోరారు. అల్లూరి సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరిలో సీతారామరాజు 117వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జ్యూట్ మిల్లు జంక్షన్ లో ఉన్న అల్లూరి విగ్రహానికి మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాటు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు.