: అంగరంగ వైభవంగా మొదలైన గుణదల మేరీమాత ఉత్సవాలు
ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే విజయవాడ లోని గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయ రెక్టార్, పలువురు గురువులు ఈ ఉదయం సమష్టి దివ్యబలిపూజ సమర్పించి, ఉత్సవాలకు నాంది పలికారు. ఇవి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గుణదల మేరీమాత ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్సవాలు.
ఈ వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తులు విచ్చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ గుణదలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అలాగే రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్ళను వేసింది.