: పింక్ సిటీలో ఇంటివద్దకే మద్యం పథకం!


రాజస్థాన్ ప్రభుత్వం ఆదాయం కోసం వినూత్న మార్గాలు అన్వేషిస్తోంది. మద్యం ప్రియులను ఎంతమేర బాదినా 'కిక్కు'రుమనకుండా ఉంటారని భావించి వారికోసం ఓ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది. దాని పేరు 'ఇంటి వద్దకే మద్యం' పథకం. ఆన్ లైన్ లో తమకు నచ్చిన బ్రాండ్ ను బుక్ చేసుకుని, ఆన్ లైన్ లోనే పేమెంట్ కట్టేస్తే చాలు, మద్యం సీసాలు దొర్లుకుంటూ వచ్చి డోర్ బెల్ కొడతాయట. ఈ రేంజిలో ప్రచారం చేస్తోంది వసుంధరా రాజె సర్కారు.

పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్లో ఈ పథకం సాధ్యాసాధ్యాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు అక్కడి అధికారులు. కాగా, ఈ పథకం ఇప్పటికే బెంగళూరు, పూణె, ఢిల్లీ వంటి మహానగరాల్లో అమల్లో ఉందట.

  • Loading...

More Telugu News