: అల్లూరికి విశాఖలో మెమోరియల్ నిర్మిస్తాం: చంద్రబాబు


'బ్రిటీష్ వారి అరాచక పాలనను వ్యతిరేకించి పోరాడిన గొప్ప స్వాతంత్ర్యోద్యమ వీరుడు అల్లూరి సీతారామరాజు' అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం తన జీవితాన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని చెప్పారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడిన అల్లూరిని అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని తరాలకు అల్లూరి ఓ స్పూర్తి అని తెలిపారు.

విశాఖలో అల్లూరి పేరిట ఓ మెమోరియల్ (స్మారకం) ఏర్పాటు చేస్తామని... అందులో అల్లూరికి చెందిన ఫొటోలు, వివరాలు, విషయాలు అన్నీ ఉంటాయని చంద్రబాబు చెప్పారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో అల్లూరి జయంతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అల్లూరి గొప్పతనాన్ని దేశ వ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News