: ఊహించని మలుపు తిరిగిన టీడీపీ కౌన్సిలర్ జానీ కిడ్నాప్ ఉదంతం
కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ షేక్ జానీని వైఎస్సార్సీపీ శ్రేణులు కిడ్నాప్ చేశారంటూ తెలుగు తమ్ముళ్లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు జమ్మలమడుగులో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే, జానీ కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ జానీ ఓ వీడియోను మీడియాకు పంపించాడు. కేవలం అనారోగ్య కారణాల వల్లే తాను ఛైర్మన్ ఎన్నికకు హాజరు కాలేకపోయాయని వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో ఉదంతంపై పలువురు పలువిధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.