: టీడీపీ కౌన్సిలర్ కిడ్నాప్ నేపథ్యంలో జమ్మలమడుగులో భారీ బందోబస్తు


కడప జిల్లా జమ్మలమడుగులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ షేక్ జానీని వైఎస్సార్సీపీ శ్రేణులు నిన్న కిడ్నాప్ చేసిన నేపథ్యంలో, పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. కిడ్నాప్ నేపథ్యంలో, జమ్మలమడుగులో నిన్న జరగాల్సిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను ఈరోజుకి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News