: రంభ వైవాహిక జీవితానికి ఖుష్బూ సర్టిఫికెట్!


తన అందచందాలతో ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ వివాహానంతరం కెనడాలో స్థిరపడిపోయింది. అయితే, ఇటీవల ఆమె వైవాహిక జీవితంపై ఊహాగానాలు చెలరేగాయి. త్వరలోనే విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో మరో సీనియర్ నటి ఖుష్బూ రంగంలోకి దిగారు. రంభపై లేనిపోనివన్నీ ప్రచారం చేయొద్దని ఓ మోస్తరు వార్నింగ్ ఇచ్చారు.

తాను ఇటీవలే కెనడా వెళ్ళానని రంభ, ఆమె భర్త ఇంద్రకుమరన్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారని తెలిపారు. తాను నయాగరా ఫాల్స్ చూడాలంటే, కుమార్తె లాన్యను తీసుకుని వారూ వచ్చారని, అందరం చక్కగా ఆస్వాదించామని చెప్పారు. వారి మధ్య స్పర్థలు ఉన్నట్టు తనకేమీ అనిపించలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News