: నేడు కారెక్కనున్న విద్యాసాగర్
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, కాంగ్రెస్ నేత నేతి విద్యాసాగర్ నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. చైర్మన్ గా స్వామిగౌడ్ ఎన్నిక వరకు విద్యాసాగర్ మండలికి తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. చైర్మన్ ఎన్నికలో ఆయన టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరుతుండడంతో ఆయనకు డిప్యూటీ చైర్మన్ పదవి ఖాయమైంది. నేడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో విద్యాసాగర్ గులాబీ కండువా ధరించనున్నారు.