: గుర్తింపు లేని పాఠశాలలకు వెసులుబాటు: కలెక్టర్
హైదరాబాదులో గుర్తింపు లేని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ వెసులుబాటు కల్పించారు. ఆయన పాఠశాల యాజమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రాథమిక సర్టిఫికెట్లను సమర్పించి స్కూళ్లను నడిపించుకోవచ్చునని కలెక్టర్ చెప్పారు. మిగిలిన నిబంధనలను పూర్తి చేసేందుకు మూడు నెలల గడువునిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల మూసివేతకు గురైన పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. అధిక ఫీజుల విషయంలో తల్లిదండ్రులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల పేర్లలో టెక్నో లాంటి పదాలు వాడరాదని, వాటిని తొలగించాలని ఆయన ఆదేశించారు.