: చెన్నై ప్రమాద ఘటనపై విచారణ కమిటీ
చెన్నైలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల భవనం కూలిన ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రఘుపతి ఈ విచారణ బృందానికి నేతృత్వం వహిస్తారు. ఈ భవన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 60కు చేరింది. ఇంకా 25 మంది వరకు భవన శిథిలాల్లో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.