: వంద రోజుల్లో రూ.10 వేల కోట్లతో పథకాలు అమలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ఆ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంద రోజుల ప్రణాళికను ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.67,845 కోట్లతో ప్రణాళికను రూపొందించామని ఆయన తెలిపారు. వంద రోజుల్లో రూ.10,114 కోట్లతో వివిధ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. సూక్ష్మ బిందు సేద్యం, పాత తోటల పునరుద్ధరణ సహా 13 అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి తెలిపారు.