: ఇవాళ 450 గోదాములపై దాడి చేశాం: రాజ్ నాథ్ సింగ్
దళారీ వ్యవస్థను, సరకును నిల్వ ఉంచి కృత్రిమ లోటు సృష్టించి సొమ్ము చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ద్రవ్యోల్బణానికి కారణం ఇలాంటి వ్యవస్థేనని, దానిని అదుపు చేస్తే ధరలు వాటంతట అవే అదుపులోకి వస్తాయని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించాయి. దీనిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. 450 గోదాములపై దాడులు నిర్వహించామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అక్రమ నిల్వలు ఉంచిన గోదాములపై భవిష్యత్ లో మరిన్ని దాడులు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.