: భూమల సర్వేకి 600 కోట్లు అడిగాం: మహమూద్ అలీ
భూముల సర్వే కోసం 600 కోట్ల రూపాయలు కేంద్రాన్ని కోరామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కబ్జా దారుల చేతుల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. త్వరలో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్ల ఖాలీలను భర్తీ చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా విధుల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.