: అది శ్వేత పత్రం కాదు...కరపత్రం...వాస్తవాలు మేం చెబుతాం: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేస్తున్నది శ్వేత పత్రాలు కావని, టీడీపీ కరపత్రాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వాస్తవపరిస్థితిపై అసలు శ్వేత పత్రాలు తాము విడుదల చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల న్యాయం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే రోజులు మరెంతో దూరంలో లేవని ఆయన తెలిపారు. రైతు రుణమఫీ సహా టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేరేదెన్నడోనని ఆయన ఎద్దేవా చేశారు.