: ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కార్
రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిన్న విద్యుత్ శాఖపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల హైదరాబాదు తిరిగి వచ్చాక ఆర్థిక శాఖ శ్వేతపత్రానికి తుది రూపునివ్వనున్నారు.