: కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీల వలసలు ఆగడం లేదు. ఎమ్మెల్సీలు పార్టీని వీడడంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ శాసన మండలి ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు. అయినా ఎమ్మెల్సీలు ఆగడం లేదు. ఉన్నవారు కూడా పార్టీ మారుతామని బహిరంగంగా చెబుతున్నారు. కేసీఆర్ లో గొప్ప దార్శనికుడు ఉన్నాడని, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసి వెళ్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ముందడుగు వేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ అభిప్రాయపడ్డారు.

నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే తాను నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చానని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News