: ప్రైవేటు ఎఫ్ఎం రేడియోల్లోనూ ఇకనుంచి వార్తలు


వార్తా స్రవంతిని మరింత వ్యాపింపజేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. ఈ మేరకు ఇకనుంచి దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ఛానళ్లలోనూ వార్తలను ప్రసారం చేయించాలనుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, ప్రైవేటు ఎఫ్ఎం రేడియోల్లో వార్తలు ప్రసారం చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎఫ్ఎం ప్రతినిధులే తనను కలసి ఈ అంశాన్ని ప్రతిపాదించారని, అందుకు తాను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు.

  • Loading...

More Telugu News