: సరయూ నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
ఉత్తరప్రదేశ్ లోని సరయూ నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. అయోధ్యలో జరిగే సుందరకాండ పారాయణం కోసం మెదక్ జిల్లా వర్గల్ వేదపాఠశాల నుంచి 40 మంది అయోధ్యకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున వీరంతా సరయూ నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చక్రపాణి (20), కిరణ్ (19) గల్లంతైన విషయం విదితమే. చక్రపాణి స్వస్థలం హైదరాబాదు మల్కాజిగిరిలోని గౌతంనగర్ డివిజన్. కిరణ్ స్వస్థలం కృష్ణాజిల్లా కాగా హైదరాబాదులోని డబీర్ పురాలో నివాసం ఉంటున్నాడు.