: ఫేస్ బుక్ చేతిలో లోక్ సభ ఎన్నికల భవితవ్యం
నేతల తలరాతను మార్చే స్థాయికి కూడా ఫేస్ బుక్ ఎదిగిపోతోంది. రానున్న లోక్ సభ ఎన్నికలలో మొత్తం 543 స్థానాలకు గాను 160 స్థానాలలో ఫేస్ బుక్ తదితర షోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వినియోగదారులు ఫలితాలను ప్రభావితం చేయగలరని ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అలాగే 67 స్థానాలలో మధ్యస్థంగా ప్రభావం చూపించగలరని తేలింది.
ఇలా సోషల్ మీడియా యూజర్లు అత్యధికంగా ప్రభావితం చేయనున్న నియోజకవర్గాలు రాష్ట్రంలో 11 ఉండడం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 21 స్థానాలు ఉన్నాయి. గుజరాత్ లో 17 స్థానాలున్నట్లు సర్వే తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో 14, కర్ణాటకలో 12, తమిళనాడులో 12, కేరళలో 10, మధ్యప్రదేశ్ లో 9, ఢిల్లీలో 7, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఐదు చొప్పున ఉన్నాయి.
ఇలా సామాజిక మీడియా అత్యధిక ప్రభావం చూపించే లోక్ సభ నియోజకవర్గాలలో ఫలితాలను తారుమారు చేయగల స్థాయిలో ఫేస్ బుక్ వినియోగదారులున్నారు. మొత్తం ఓటర్లలో వీరు 10శాతానికి పైగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది.