: ఏపీలోని 90 మున్సిపాలిటీల్లో... 74 టీడీపీవే
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీల్లో టీడీపీ హవా కొనసాగింది. మొత్తం 90 మున్సిపాలిటీల్లో 74 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ 15, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. కాగా, రెండింటిలో ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ లోని 7 కార్పొరేషన్లలో ఇప్పటివరకు ఆరింటిలో ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ 5 కార్పొరేషన్లలో విజయం సాధించగా, వైఎస్సార్సీపీ ఒక్క కార్పొరేషన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. చిత్తూరు, అనంతపురం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు కార్పొరేషన్లలో టీడీపీ విజయం సాధించింది. కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమైంది.