: ఏపీఎన్జీవోలకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదు శేరిలింగంపల్లి మండలంలోని గోపన్ పల్లి సర్వే నంబర్ 36, 37లో ఏపీఎన్జీవోలకు చెందిన 189 ఎకరాల 14 గుంటల భూమిని టీ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. 2005లో ఏపీఎన్జీవోలకు ఆ భూమిని కేటాయించారు. అయినా ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదట. దాంతో, తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ ఒడ్దార్, శేరిలింగంపల్లి తహశీల్దారు విద్యాసాగర్ ఆధ్వర్యంలో భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.