: ఉత్తరాదిని పలుకరించిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉత్తరాదిన రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను తాకాయి. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో తొలకరి జల్లులు కురిశాయి. దీంతో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించింది. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుజరాత్ లోని పత్తి రైతులు మాత్రం వానల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు.