: పోలీస్ ఉన్నతాధికారులకు న్యూయార్క్, లండన్ లలో స్టడీ టూర్: నాయిని


హైదరాబాదులో మెరుగైన పోలీసింగ్ కోసం డీజీపీ, జంట నగరాల కమిషనర్లను స్టడీ టూర్ కు పంపిస్తున్నట్టు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. ఈ మేరకు రంజాన్ తర్వాత వారంతా న్యూయార్క్, లండన్ లలో పర్యటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే న్యూయార్క్, లండన్ లలో తాను కూడా పర్యటిస్తానన్నారు. జంటనగరాల్లో నేరాలు అరికట్టేందుకు లండన్ తరహాలో రెండువేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో శాంతి భద్రతల దృష్ట్యా త్వరలో పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇక పోలీసుల యూనిఫాం మార్పు విషయంలో వెనక్కి తగ్గమని, సీఎం కేసీఆర్ చెప్పింది తప్పకుండా పాటిస్తామన్నారు.

  • Loading...

More Telugu News