: గ్రీన్ బావర్చీ హోటల్ లో అగ్నిప్రమాదం


సికింద్రాబాద్ లోని గ్రీన్ బావర్చీ హోటల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సరసమైన ధరకు బిర్యానీ అందిస్తారనే పేరున్న గ్రీన్ బావర్చీ హోటల్ లో ఎప్పట్లానే వంట ప్రారంభించేందుకు పొయ్యి వెలిగించగా ప్రమాదవశాత్తు మంటలు రేగాయి. అవి గది మొత్తం వ్యాపించడంతో వంటగదిలోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. దీంతో రంగప్రవేశం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని హోటల్ కు తాళం వేశారు.

  • Loading...

More Telugu News