: మోడీ కాశ్మీర్ పర్యటనలో షార్ప్ షూటర్లు


ప్రధాని నరేంద్ర మోడీ రేపు కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఆయన రాక సందర్భంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక స్థానాల్లో షార్ప్ షూటర్లను ఉంచాలని నిర్ణయించారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం మోడీ శ్రీనగర్లో అత్యున్నత స్థాయి సైనిక సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సైనిక దళాల నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా, రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్ర కుమార్ హాజరవుతున్నారు. అటుపై, బారాముల్లా జిల్లాలోని యూరి పట్టణంలో 240 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

శ్రీనగర్, యూరి మధ్య దూరం 87 కిలోమీటర్లు కాగా, 2000 మంది భద్రతా సిబ్బందిని దారిపొడవునా నియమించారు. ప్రధాని రోడ్డు మార్గం ద్వారా యూరి చేరుకోనుండడమే ఇందుకు కారణం. ఇక, వేర్పాటు వాదులు మోడీ రాకను నిరసిస్తూ కాశ్మీర్ లోయలో బంద్ కు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News