: లోక్ సభలో ప్రతిపక్ష హోదా మాకే ఇవ్వండి... స్పీకర్ ను కోరిన కాంగ్రెస్


ప్రస్తుత లోక్ సభలో ప్రతిపక్ష హోదాను తమకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలసి విన్నవించారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ 44 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుపొందింది. దాని ప్రకారం పార్లమెంటు నిబంధనల కింద ప్రతిపక్ష హోదా పొందే ఛాన్స్ హస్తానికి లేదు. మరోవైపు వీరికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతివ్వనుందని కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News