: ఇక 2 రూపాయలకే... 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు
రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు అందించే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా... ఎన్నికల హామీల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.