: డామిట్ కథ అడ్డం తిరిగింది...చక్రం తిప్పిన జేసీ... కౌన్సిలర్ రాజీనామా


అనంతపురం జిల్లాలోని తాడిపత్రి టీడీపీలో ముసలం పుట్టింది. చైర్ పర్సన్ అభ్యర్థి పదవి ఆశించి భంగపడిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి సరస్వతి తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కుతుందని సరస్వతికి పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని సమాచారం. ఇంతలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి రంగప్రవేశం చేయడంతో ఛైర్మన్ పదవి రేసులో ఆమె పేరు వెనక్కి వెళ్లిపోయి కొత్త వ్యక్తి పేరు ముందుకు వచ్చింది. ఛైర్ పర్సన్ గా ఆమె ఎన్నిక దాదాపు పూర్తవుతున్న తరుణంలో పార్టీ సహచరులు అనూహ్యంగా వేరే వ్యక్తిని తెరపైకి తీసుకురావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డామిట్ కథ అడ్డం తిరిగింది, అంటూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News