: సీఎం కేసీఆర్ కు ఏపీ డిప్యూటీ స్పీకర్ కితాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. రాజకీయ నాయకులు ఎందరో ఉన్నా సాహిత్యాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి, ఔపోసన పట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్న తెలంగాణలో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో తెలుగు భాష, సంస్కృతులు వర్ధిల్లుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుద్ధ ప్రసాద్ ఉపసభాపతిగా ఎన్నికైన సందర్భంగా కిన్నెర ఆర్ట్ థియేటర్స్, ఏపీ సాహితీ-సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికపై ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా మాట్లాడారు.