: ఎమ్మెల్యే, ఎంపీలను రేపు, ఎల్లుండి బయటకు పంపండి... ఈసీకి వైసీపీ లేఖ


ఈ నెల 4,5 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల పదవికి పరోక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను బయటకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ రాసింది. ఈ మేరకు నేడు సమావేశమైన ఆ పార్టీ జనరల్ బాడీలో ఇలా నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికల్లో ఇప్పటికే పలుచోట్ల కిడ్నాపులు, ప్రలోభాలు జరిగాయనీ, అటువంటప్పుడు ప్రజా ప్రతినిధులు అక్కడే ఉంటే ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పార్టీ లేఖలో తెలిపింది.

  • Loading...

More Telugu News