: కాంగ్రెస్ కు ప్రచారం చేసినందునే నాగార్జున భూ కబ్జా: రేవంత్ రెడ్డి


హైదరాబాద్ మాదాపూర్ లోని మూడెకరాల తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెషన్ సెంటర్ ను నిర్మించారంటూ నటుడు నాగార్జునపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి నాగార్జున ప్రచారం చేసినందువల్లే చెరువును ఆక్రమించారని తీవ్రంగా ఆరోపించారు. చెరువును అక్రమంగా కబ్జాచేయడమే కాకుండా, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని నాగార్జున అనడం అన్యాయమన్నారు. చెరువు మధ్యలో నాగార్జున అక్రమంగా హాల్ నిర్మించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కబ్జాకు గురయిన చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సూచించారు. మరోవైపు, తక్కువ ధరలకు అన్నపూర్ణ స్టూడియోస్ కు భూములు తీసుకుని అందులో యాక్టింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారని, అయితే విద్యార్ధులకు ఫీజులల రాయితీ ఇవ్వకపోవడం అన్యాయమని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News