: భూమికి అతి దగ్గరగా వస్తున్న గ్రహశకలం


మన భూమి వైపు ఒక గ్రహశకలం దూసుకువస్తోంది. 13 అంతస్థుల అపార్ట్ మెంటు అంత సైజులో వుండే ఈ గ్రహశకలం వచ్చే శుక్రవారం నాటికి భూమికి అతి దగ్గరగా రానుంది. మన ఉపరితలానికి కేవలం 28 వేల కిలోమీటర్ల ఎత్తుకి ఈ గ్రహశకలం రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ఓ ప్రకటనలో పేర్కొంది.

సెకనుకి 5 కిలోమీటర్ల వేగంతో... అంటే, బుల్లెట్ వేగానికి ఎనిమిదింతల వేగంతో ఈ శకలం దూసుకువస్తున్నట్టు నాసా తన ప్రకటనలో తెలిపింది. అయితే, దీని వల్ల మన భూమికి ఎటువంటి ప్రమాదమూ లేదనీ, ఎవరూ భయపడవలసిన అవసరం అసలే లేదనీ నాసా భరోసా ఇచ్చింది.

ఈ గ్రహశకలం పేరు 2012-D14. ప్రతి 1200 సంవత్సరాలకు ఓసారి ఇది మన భూమికి ఇలా అతి సమీపంగా వచ్చి వెళుతుంటుంది!

  • Loading...

More Telugu News