: తెలంగాణలో దూసుకుపోతున్న టీఆర్ఎస్
తెలంగాణలోని పలు జిల్లాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తెలంగాణలోని మొత్తం 3 కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీల్లో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
మెదక్ జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించాయి. రంగారెడ్డి జిల్లాలోని 5 పురపాలక సంఘాల్లో టీడీపీ 2, కాంగ్రెస్ 2, టీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. ఖమ్మం జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.