: గుంటూరు జిల్లాలో 10 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం


గుంటూరు జిల్లాలో 10 మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో... టీడీపీ-10, వైఎస్సార్సీపీ-1, టీడీపీ-సీపీఐ కలసి ఒక స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. తెనాలి మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీ అభ్యర్థి కొత్తమాను తులసీదాసు, నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ గా నాగసరపు సుబ్బరాయ గుప్తా (టీడీపీ), బాపట్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తోట మల్లీశ్వరి (టీడీపీ), రేపల్లె మున్సిపల్ ఛైర్మన్ గా తాడివాక శ్రీనివాసరావు (టీడీపీ), చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గా గంజి చెంచు కుమారి (టీడీపీ), పొన్నూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ గా సజ్జా హేమలత (టీడీపీ), మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ గా గంజి చిరంజీవి (టీడీపీ), మాచర్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా గోపవరపు శ్రీదేవి (టీడీపీ), సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా ఎల్లినీడి రామస్వామి (టీడీపీ) ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కాజీపూర్ జాన్ బీ (సీపీఐ) ఎన్నికయ్యారు. తాడేపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కొయ్యగూర మహాలక్ష్మి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News