: టైలర్ తప్పుతో సూపర్ స్టార్ కు యాంగ్రీ యంగ్ మెన్ లుక్


నిండైన విగ్రహానికి, సూటిగా చూసే చూపుకు, ప్రశ్నించేందుకు సిద్దంగా ఉండే నోటికి తోడు రెండు బటన్లు పైకి ముడేసిన బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ఖాఖీ ప్యాంటు, భుజం మీద వేలాడే తాడు కలిసి దీవార్ లో అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ యంగ్ మెన్ లుక్ తెచ్చాయి. అయితే ఈ లుక్ కి కారణం క్రియేటివిటీ కాదని, టైలర్ చేసిన తప్పు అని అమితాబ్ వెల్లడించారు. సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ట్విట్టర్ ద్వారా ఏదో ఒక కొత్త విషయం వెల్లడించే బిగ్ బీ తాజాగా తన యాంగ్రీ యంగ్ మెన్ లుక్ గురించి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

అందులోని విశేషాలే దీవార్ లుక్. 1975లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ చొక్కా ముడేసుకోవడానికి కారణం. టైలర్ పొరపాటుగా చొక్కాను పొడుగ్గా కుట్టేశాడు. అమితాబ్ బచ్చనే పొడవు. ఇంకా పొడవు షర్టు బాగోదని భావించిన అమితాబ్, రెండు బటన్లు విప్పి ముడేసి, భుజం మీద తాడు వేసుకున్నారట. అంతే, దర్శకుడు ఓకే చేయడం, సినిమాలో ఆ లుక్ తో అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మెన్ గా విపరీతమైన క్రేజ్ రావడం జరిగిపోయింది. సినిమా సూపర్ హిట్టై నిర్మాతకు కనకవర్షం కురిపించడం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News