: రేపటికి వాయిదా పడ్డ మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇకపోతే, జిల్లాలోని మిగిలిన 5 మున్సిపాలిటీల్లో నాలుగింటిని టీడీపీ, ఒక మున్సిపాలిటీని వైకాపా దక్కించుకున్నాయి.