: మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిపై కేసు నమోదు


కడప జిల్లా రాజంపేటకు చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిమిట్ట మండలం నర్వకాటిపల్లె ఎంపీటీసీగా గంగాదేవి గెలుపొందారు. శుక్రవారం నాడు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో... గంగాదేవి కనిపించడం లేదని ఆమె భర్త నరసింహులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఇంట్లో నిర్బంధించినట్లు తెలియడంతో అక్కడకు వెళ్లామని, తమను ఎమ్మెల్యే కులం పేరుతో దూషించారని నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News