: అసలు, ఎవరీ షరపోవా?... టెన్నిస్ రాణికి సచిన్ ఫ్యాన్స్ కౌంటర్


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదని టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా అమాయకంగా బదులివ్వడంపై ట్విట్టర్లో కౌంటర్ల పర్వానికి తెరలేచింది. క్రికెట్ లో అనితర సాధ్యమన రికార్డులు నెలకొల్పి, సమున్నత శిఖరంలా నిలిచిన సచిన్ ఎవరో తెలియదనడంపై అభిమానులు కాస్తంత తీవ్రంగానే స్పందించారు. ఆల్ టైమ్ టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్, ఫార్ములా వన్ లెజెండ్ మైకేల్ షూమాకర్ లు సైతం సచిన్ అభిమానులే. అలాంటిది సచిన్ ఎవరో తెలియదంటుందా? అన్నది ఫ్యాన్స్ ఆగ్రహం. "అసలు, ఎవరీ షరపోవా?" అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. అంతేగాకుండా, నవ్వు పుట్టించే పోస్టింగ్ లతో షరపోవాకు సెటైర్లు విసిరారు.

సచిన్ ఎవరో తెలిశాక, షరపోవా కుమిలిపోతుందని ఓ పోస్టింగ్, "ఇలా మాట్లాడితేనే... నాకు ప్రజలను కొరకాలనిపిస్తుంది" అని ఉరుగ్వే ఫార్వర్డ్ లూయిస్ స్వారెజ్ అంటున్నట్లుగా మరో పోస్టింగ్, "షరపోవాకు సచిన్ ఎవరో తెలియదట!" అని హాలీవుడ్ స్టార్ లియొనార్డో డికాప్రియో తోటి నటుడితో అనగా, అతడు "షరపోవా ఎవరు?" అంటున్నట్లుగా ఇంకొక పోస్టింగ్... ఇలా చిత్రమైన పోస్టింగ్ లో షరపోవాను తూర్పారబట్టారు. మరివన్నీ చూస్తే ఈ రష్యన్ బ్యూటీకి దిమ్మ తిరిగిపోతుందేమో!

  • Loading...

More Telugu News