: ముగిసిన రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు


హైదరాబాదు బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం వైభవంగా జరిగింది. కోలాటం, బంజారాల నృత్యాల నడుమ అందంగా అలంకరించిన అమ్మవారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. రథం వద్ద స్థానిక కార్పొరేటర్ శేషుకుమారి ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునందన్ రావుతో కలిసి గుమ్మడికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి దారిపొడవునా కొబ్బరికాయలు కొట్టి, మంగళహారతులిచ్చారు. దేవస్థానం నుంచి బయల్దేరిన రథం బల్కంపేట, వేంకటేశ్వర ఆలయం, బీకే గూడ, శ్రీరాంనగర్ మీదుగా రథోత్సవ ఊరేగింపు కొనసాగింది. ఈ రథోత్సవంతో మూడు రోజుల నుంచి నిర్వహించిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ముగిసినట్లు ఈవో చెప్పారు.

  • Loading...

More Telugu News