: ఆ క్లిప్పింగులు బయటపెడతామని సినీనటి బెదిరిస్తోంది
కన్నడ నటి నయన కృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులకు కృష్ణప్ప అనే వ్యక్తి నయన కృష్ణపై ఫిర్యాదు చేశారు. 2010లో తాను నయన కృష్ణతో శృంగారంలో ఉండగా, ఆమె స్నేహితులు మేఘనా, రిహానా తీసిన వీడియోలను బయటపెడతామని, అవి బయటపెట్టకుండా ఉండాలంటే తాము సూచించినంత డబ్బు ఇవ్వాలని, నయన కృష్ణ బెదిరింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, 12 రోజుల క్రితం నయన కృష్ణ ఓ వైద్యుడిని కూడా ఇదే తరహాలో బెదిరించింది. డబ్బు తీసుకునేందుకు వచ్చిన ఆమె స్నేహితులను పోలీసుల అరెస్టు చేసి విచారిస్తుండడంతో నయన కృష్ణ పరారీలో ఉంది. అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. నయన కృష్ణకు కన్నడ సినీ పరిశ్రమలో మంచి పరిచయాలు ఉండడంతో ఇంత వరకు ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, వైద్యుడు ఫిర్యాదు చేయడంతో ఆమె బాధితులు ఒక్కక్కరే బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నయన కృష్ణ కన్నడ నాట శృంగారనాయకిగా నటించింది.