: మోడీ రాక దగ్గర పడుతున్న కొద్దీ రెచ్చిపోతున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన దగ్గరపడుతున్న కొద్దీ పాక్ సేనలు రెచ్చిపోతున్నాయి. పూంఛ్ జిల్లాలోని కృష్ణాఘాటీ సెక్టార్ లో గత 24 గంటల్లో పాక్ సైనికులు రెండు సార్లు అంతర్జాతీయ సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత సేనలు వారి ప్రయత్నాన్ని వమ్ము చేయడంతో రెండు సార్లూ పాక్ సైనికులు తోకముడిచారు.
ఉగ్రవాదులను భారతలోకి పంపించే సందర్భాల్లో ఇలాంటి చర్యలకు పాక్ సైన్యం పాల్పడుతుంది. పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని భారత సేనలు కాల్పులు జరుపుతుండగా... పాక్ ఉగ్రవాదులను మరో తోవలో భారత్ లోకి పంపుతుంది. అలాంటి ప్రయత్నమే పాక్ సైనికులు చేయడంతో ముగ్గురు తీవ్రవాదులను భారత సేనలు మట్టుబెట్టాయి. దీంతో మిగిలిని ఆరుగురు తీవ్రవాదులు పలాయనం చిత్తగించారు.