: మరణశిక్షను జీవితఖైదుగా మార్చడం కుదరదు: సుప్రీం కోర్టు
ఖలిస్థానీ తీవ్రవాది దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరణ శిక్ష అమలులో ఆలస్యం కారణంగా దానిని జీవిత ఖైదుగా మార్చలేమని న్యాయస్థానం పేర్కొంది. ఉరిశిక్షనే ఖరారు చేసింది. 1993లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిట్టాపై కారు బాంబు దాడి కేసులో భుల్లార్ కు మరణశిక్ష విధించారు.