: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో షకీరా ఒంటి విరుపులు
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. జూలై 13న ఫైనల్ మ్యాచ్ ముందు పాప్ స్టార్ షకీరా ప్రదర్శన ఉంటుందని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ముగింపు ఉత్సవంలో షకీరాతో పాటు గిటార్ మ్యాస్ట్రో శాంటానా, రాప్ ఆర్టిస్ట్ విక్లిఫ్ జీన్ కూడా పాల్గొంటారు. కాగా, షకీరా వరల్డ్ కప్ అఫీషియల్ సాంగ్ 'లా లా లా'ను బ్రెజిల్ స్టార్ కార్లినోస్ బ్రౌన్ తో కలిసి ఆలపించనుంది.