: అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్టు
ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది జాహిద్ హుస్సేన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే అతగాడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, బంగ్లాదేశీయుడైన తాను ఐఎం దర్భాంగా సెల్ కు యాక్టివ్ సభ్యుడిగా కొనసాగుతునట్టు తెలిపాడు. 2010లో పూణెలోని జర్మనీ బేకరీ పేలుడు కేసులో అతడిని అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. నాటి ఘటనలో 17 మంది మరణించగా 64 మందికి తీవ్ర గాయాలయ్యాయి.