: 'కేసీఆర్ నాకు తెలియని వ్యక్తా? తెలంగాణ, ఏపీ ఏమైనా ఇండియా, పాకిస్తాన్ లా?'
రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను ఏంచేయడానికైనా సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరావుతో భేటీ అయ్యేందుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ తనకు తెలియని వ్యక్తేమీ కాదని, ఆయనను కలిసేందుకు తనకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. తెలుగుదేశం పార్టీకి రెండు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యమేనని, తెలంగాణలో తమ పార్టీకి 22 నుంచి 23 శాతం ఓటర్లు మద్దతుగా నిలిచారని బాబు పేర్కొన్నారు.
ఇక, సచివాలయంలో ఏపీ,తెలంగాణ విభాగాల మధ్య బారికేడ్లు నిర్మించడాన్ని బాబు నిలదీశారు. ఏపీ,తెలంగాణ ఏమైనా భారత్, పాకిస్థాన్ లా? అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య తీవ్ర విభేదాలు ఏమీ లేవు కదా? అని బాబు వ్యాఖ్యానించారు.