: ద్వారకాపీఠ్ శంకరాచార్యపై అలహాబాద్ హైకోర్టులో పిల్
సాయి భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ ద్వారకాపీఠ్ శంకరాచార్యులు స్వరూపానంద సరస్వతిపై లక్నోలోని సాయి ఆలయ అథారిటీ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పిల్ లో కోరారు. పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించడం తప్పంటూ కొన్ని రోజుల కిందట శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల ఆయనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.