: మోడీ సన్నిహితుడు అమిత్ షాకు జడ్ ప్లస్ భద్రత
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ జనరల్ సెక్రటరీ అమిత్ షాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన ప్రముఖుల పేర్లతో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో అమిత్ షా పేరు కూడా చేర్చారు. అమిత్ షా ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా సీట్లు దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ భద్రత కల్పించాలన్న నిర్ణయం తీసుకుంది. కాగా, దేశంలో జడ్ ప్లస్ భద్రతను 250 మంది వరకు ప్రముఖులకు అందిస్తున్నారు.