: హైదరాబాదులో గుత్తా 'జ్వాల' అకాడమీ


హైదరాబాదులో త్వరలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అకాడమీ ప్రారంభించనుంది. ఈ మేరకు అకాడమీ నిర్వహణకు సంబంధించి ఆమె ఇచ్చిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. అయితే, కొత్తగా భూమి కేటాయింపు చేయకుండా అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం జ్వాలకు సూచించింది. ఈ క్రమంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంను లీజు ప్రాతిపదికన ప్రభుత్వం ఇవ్వనుంది.

దానికి కొన్ని మెరుగులు దిద్ది అక్కడే చిన్నారులకు జ్వాల శిక్షణ ఇవ్వనుంది. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా జ్వాల పేరుతోనే పూర్తిగా అకాడమీ నిర్వహణ సాగుతుంది. తనకు పేరు తెచ్చిన ఆటలో కొత్త తరాన్ని తీర్చిదిద్దాలనేదే తన ఆలోచన అని ఈ సందర్భంగా జ్వాల తెలిపింది. ప్రస్తుతం తాను ఆటలోనే కొనసాగుతున్నాను కాబట్టి, కోచ్ ల సహకారంతో అకాడమీ నిర్వహణ కొనసాగుతుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News